Teja Sajja: ప్రేక్షకుల్లో భారీ అంచనాలుతో జై హనుమాన్ మూవీ ... 3 d ago

యంగ్ హీరో తేజా సజ్జా మరియు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన 'హనుమాన్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. అలాగే 'హనుమాన్'కు తదనంతరం జై హనుమాన్' ఉండబోతుందని ప్రశాంత్ వర్మ తెలిపిన విషయం తెలిసిందే. ఇందులో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఆంజనేయస్వామి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.